telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటరత్న ఎన్. టి.రామారావు నటించిన 60 సంవత్సరాల “శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం” చిత్రం

నటరత్న ఎన్. టి.రామారావు గారు భగవంతుడు గాను, భక్తుడు గాను నటించిన చిత్రం అశ్వరాజా పిక్చర్స్ వారి “‘ శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం'” 27-06-1964 విడుదలయ్యింది.

నిర్మాత పి.సత్యనారాయణ గారు అశ్వరాజా పిక్చర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు యస్.రజనీకాంత్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే,పర్యవేక్షణ: కె.గోపాలరావు,

మాటలు,పాటలు: సముద్రాల రామానుజాచార్య (జూనియర్),

సంగీతం: ఘంటసాల,

ఫోటోగ్రఫీ: సి.నాగేశ్వరరావు,

కళ: వాలి, నృత్యం: వెంపటి సత్యం,
ఎడిటింగ్: ఎన్.ఎస్.ప్రకాష్ అందించారు.

ఈచిత్రం లో ఎన్.టి. రామారావు,కృష్ణకుమారి, కాంతారావు, చలం, రమణారెడ్డి, ఛాయాదేవి, రేలంగి , గిరిజ, అల్లు రామలింగయ్య, ప్రభాకర రెడ్డి, గీతాంజలి, ఉదయాలక్ష్మి, సూర్యకళ,మహంకాళి వెంకయ్య, ఎ. వి.సుబ్బారావు, లంక సత్యం తదితరులు నటించారు.

ప్రఖ్యాత నేపధ్యగాయకులు, సంగీత దర్శకులు
ఘంటసాల గారి స్వరకల్పనలో వెలువడిన పాటలు
“మాధవా మౌనమా సనాతనా ”
“ఏ ప్రసాద మహిమో ఇలరాజు లాసించు”
“సత్యదేవుని సుందరరూపుని నిత్యము సేవించండీ,”
“జయ జయ శ్రీమన్నారాయణ,జయ
విజయీభవ నారాయణ”  వంటి పాటలు , పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈచిత్రం లో ఎన్టీఆర్ గారు శ్రీ సత్యనారాయణస్వామి గాను, భక్తుడు సత్యదాసు గాను ద్విపాత్రాభినయం చేశారు.

అత్యధ్బుతమైన భక్తి గీతాలతో అత్యంత భక్తిరసంగా రూపొందిన ఈ పౌరాణిక చిత్రం విజయం సాధించి పలుకేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుని 10 వారాలకు పైగా ప్రదర్శింపబడింది…

Related posts