telugu navyamedia
Uncategorized

మోదీ  కేబినెట్‌లో ఆరుగురు మహిళా మంత్రులు

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండవసారి  ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ సారి మోదీ కేబినెట్‌లో కేబినెట్‌లో ఆరుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

వీరిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు కాగా, మరో ముగ్గురు సహాయ మంత్రులు. కేబినెట్ మంత్రులుగా నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, సహాయ మంత్రులుగా రేణుకా సింగ్ సరుతా, సాధ్వి నిరంజన్ జ్యోతి, దేబో శ్రీ చౌదరి ప్రమాణం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖ  అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Related posts