సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి విచ్చేశారు. ఈరోజు (బుధవారం) ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని చేరుకున్నారు.
ఈ సందర్భంగా మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి ప్రధాని వెళ్లనున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు.
దర్శనానంతరం హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇందులో భాగంగా రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు.
ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , నారా లోకేష్ , ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ , ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ , ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ఉత్సవాల్లో పాల్గొంటారు.
వివిఐపీల రాక నేపథ్యంలో పుట్టపర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

