లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు రేషన్ కార్డును వినియోగించుకోవచ్చని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..యూపీకి చెందిన కార్మికులెవరైనా లాక్ డౌన్ తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ఆయా ప్రాంతాల్లో రేషన్ సరుకులు పొందవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధి కింద, ఆహార సామాగ్రి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు యూపీలోని హాట్ స్పాట్లలో పోలీసులు ఇంటివద్దకే నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.