telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కోడికూత…

పొద్దులో
సుద్దులెన్నో,
సుద్దుచెప్పే
గాథలెన్నో!
గుండెలో
గోడులెన్నో,
గోడెవెనుక
దాడులెన్నో!
————–
మాట‌లోన
ముచ్చటెంతొ,
మూగమనసు
భావమెంతొ!‌
తేటిలోని
తాపమెంతొ,
మల్లెలోని
తమకమెంతొ!
—————-
కోడికూత
కోపమెంతొ,
కాళరాత్రి
కర్మమెంతొ!
కాలజ్ఞాని
కార్యమెంతొ,
కార్యకర్త
జ్ఞానమెంతొ!
————–
వాపునోటి
వదరులెన్నొ,
దురదరేగి
దరువులెన్నొ!
మౌనిలోని
మర్మమెంతొ,
మాన్యతెరిగి
మసలునెంతొ!
——————
పొద్దుటేళ
గున్నమావి,
పొద్దుమాపు
మర్రిమాను!‌
పురిటికేక
పైరగాలి,
పండుటాకు
రెళ్ళుగడ్డి!‌
—————
రిక్కపొద్దు
చక్కదనము,
చుక్కపొద్దు
చిక్కదనము!
పల్లెపడుచు
మల్లెమనసు,
మళ్ళిపోతె
రుచులగురుతు!

Related posts