telugu navyamedia
CBN pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో లోకేష్ నేడు (శుక్రవారం) సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోదీ.

ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించారు.

జీఎస్టీ స్లాబ్‌ల హేతుబద్ధీకరణ, సంస్కరణల అమలుపై ప్రధాని మోదీకి లోకేష్ అభినందనలు తెలిపారు.

ప్రత్యేకించి విద్యారంగంలో ఉపయోగించే పలు రకాల వస్తువులపై పన్ను తగ్గించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్‌లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నారా లోకేష్

Related posts