telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ లేఖపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

srinivasa rao minister

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు బహిరంగ లేఖ రాయడంపై మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ రావు మండిపడ్డారు. స్పీకర్ కు లోకేశ్ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత గత సీఎం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు.

శాసన సభ్యులను సంతల్లో పశువుల్లా కొన్నాప్పటికీ అప్పటి స్పీకర్ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.లోకేశ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని దుయ్యబట్టారు. జగన్ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. జగన్ తలచుకుంటే లోకేశ్ సహా అందరూ వైసీపీలోకి వస్తారన్నారు.

Related posts