తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ముందంజలో దూసుకు వెళుతున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో 12 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు.
లోకేశ్ దూకుడు ముందు వైసీపీ అభ్యర్థి ఎం.లావణ్య నిలబడలేకపోతున్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి లావణ్యపై 12,121 ఓట్లతో లోకేశ్ లీడ్ లో కొనసాగుతున్నారు.