టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు.
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి