telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2” ఫ్యామిలీ ఇదే

Manmathudu-2

“మ‌న్మ‌థుడు” సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ “మ‌న్మ‌థుడు-2”. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ (జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న “మ‌న్మ‌థుడు-2” చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. తాజాగా ‘‘నేను, నా ‘మన్మథుడు 2’ ఫ్యామిలీ!! లవింగ్‌ ఇట్‌’’ అంటూ నాగార్జున ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో సీనియర్‌ నటి లక్ష్మీ, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రావు రమేశ్‌, ‘వెన్నెల’ కిశోర్‌, ఝాన్సీ, చిత్రదర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు ఉన్నారు. ఇక “RX100” ఫేమ్  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Related posts