telugu navyamedia
సినిమా వార్తలు

నారాయణ… నారాయణ ఎవర్ని ఉద్దేశించి ఆ మాట అనలేదు-నాగార్జున

బిగ్ బాస్ పై ఇటీవల కాలంలో సీపీఐ నేత నారాయణ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.అమ్మాయిలు, అబ్బాయిలను తెచ్చి ఒక ఇంట్లో ఉంచడమేంటని విమర్శించారు. అది బిగ్ బాస్ హౌస్ కాదని బ్రోతల్ హౌస్ అంటూ విమ‌ర్శించారు.

తాజాగా ఓ ఎపిసోడ్ లో నాగార్జున వేసిన డైలాగులు వివాదాస్పదం అయ్యాయి. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మెరీనా – రోహిత్ జంట గురించి మాట్లాడుతూ ‘మీకు లైసెన్స్ ఉంది, గట్టిగా హగ్ ఇచ్చుకోండి’ అని చెప్పారు. వారు హగ్ ఇచ్చుకుంటున్నప్పుడు నారాయణ… నారాయణ’వారిద్దరూ భార్యభర్తలు… అంటూ నాగార్జున‌ అన్నారు..

దీనిపై సీపీఐ నేత నారాయ‌ణ‌ ఘాటుగా స్పందించారు. ‘బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లయిన జంటలకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నారు… మరి మిగతా వాళ్లు సంగతి ఏంటి? వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు, బంధువులూ కాదు, వంద రోజులు ఆ ఇంట్లో వారేం చేస్తారు… నాగన్నా’ అంటూ కౌంటర్ వేశారు

ఇప్ప‌టివ‌ర‌కు నారాయ‌ణ‌ విమర్శలకు స్పందించిన‌ నాగార్జున బిగ‌బాస్ షోలో చేసిన వ్యాఖ్య‌ల‌కు తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

తాను ఆ రోజు అలా బిగ్ బాస్ వేదికపై ఎవరినీ ఉద్దేశించి అనలేదని చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్‌ లో గతంలో కూడా కొన్ని సార్లు ఆ మాట వాడాను. అంతే కానీ నేను ఎవర్నీ ఉద్దేశించి ‘నారాయణ నారాయణ’ అనలేదు” అని నాగార్జున స్పష్టం చేశారు.

అలాగే బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. “బిగ్‌ బాస్‌ లో ఎవరు డ్రామా చేస్తున్నారు? ఎవరు గేమ్స్‌ ఆడుతున్నారు? అని విశ్లేషిస్తుంటే నాకు లైఫ్‌ లెసెన్స్‌లా అనిపిస్తోంది. మన కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం అనేది చిన్న విషయం కాదు. నేను హోస్ట్ గా చేస్తాను కానీ, పార్టిసిపెంట్ గా మాత్రం బిగ్‌బాస్‌ లోకి వెళ్ళను, వెళ్ళలేను” అని తెలిపారు.

Related posts