telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : శ్రీముఖిపై సోషల్ మీడియాలో హాట్ చర్చ

Srimukhi

బిగ్‌బాస్-3 తొలిరోజు నుంచే హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ త్రీ. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలవాలంటే హాస్‌లో ఎలా ఉంటున్నామో అన్నది ఒక ఎత్తయితే, సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే అవసరం. ఇక ఎనర్జిటిక్ యాంకరింగ్ తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే. ఫుల్ మేకప్ తో స్క్రీన్ పై కనిపించిన శ్రీముఖి అసలు రంగు బిగ్ బాస్ హౌస్ లో బయటపడింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే శ్రీముఖి… అక్కడ కూడా మేకప్ తోనే కనిపించేది. అయితే… బిగ్ బాస్ హౌస్‌లో మేకప్ వేసుకునేందుకు అవకాశం ఉన్నా ఎప్పుడూ మేకప్ తో ఉండలేరు కాబట్టి మేకప్ లేకుండా తన ఒరిజినాలిటీ బయటపడుతోంది. ఇన్నాళ్లూ శ్రీముఖిని అందాన్ని ఊహించుకుంటా ఊహా లోకంలో విహరించిన కుర్రకారు ఏంటి శ్రీముఖి ఒరిజినల్‌గా ఇలా ఉంటుందా అనుకుంటున్నారు. మేకప్ లేకపోవడంతో శ్రీముఖి చమనఛాయగా కనిపిస్తోంది. శ్రీముఖి స్కిన్ టోన్ పై మిక్స్డ్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి మేకప్ లోనే బాగుంటుందంటే… మరి కొందరు మేకప్ లేకున్నా బాగానే ఉందనే డిస్కస్ చేసుకుంటున్నారు.

Related posts