ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయఢంకా మోగించింది.
పిఠాపురంలో జనసేనాని రికార్డు స్థాయిలో 70వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇలా జనసేనానికి తిరుగులేని విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలకు ఆ పార్టీ నేత నాగబాబు ధన్యవాదాలు తెలియజేశారు.
“ఆయన విజయాన్ని భుజాన వేస్కునే భాద్యత మీరు తీస్కుని ఇంతటి ఘన విజయాన్ని అందించారు. మీ భాద్యత ఆయన భుజాల మీద వేస్కుని మీ కష్టానికి కాపు కాస్తాడు. మీ భవిషత్తు భధ్రత కి కాపలా కాస్తాడు. మేము కూడ పిఠాపురం అభివృద్ధి లో మన నాయకుడితో భాగమవుతాము,
ఇది సేనాని మాటగా నేను మీకు మనసా వాచా కర్మణా చెప్తున్నాను” అని నాగబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని