telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పాక్ లో కొత్త చట్టం.. అత్యాచారం చేస్తే…

imran on terrorism in UN

మనం చూస్తూనే ఉన్నం… ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు అనేక దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది పాకిస్థాన్‌ సర్కార్. అత్యాచారానికి తెగబడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా.. మార్చేందుకు వీలు కల్పించే నూతన చట్టానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అత్యాచార నిరోధక ఆర్డినెన్సు పేరుతో న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను ఫెడరల్‌ కేబినెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. లైంగిక వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా, సాక్ష్యులకు రక్షణ కల్పించేలా కూడా అందులో పటిష్ఠ నిబంధనలు చేర్చినట్లు తెలిపింది. అయితే-ఈ ముసాయిదా విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఇలాంటి చట్టమే ఒకటి భారత్ లో కూడా తేవాలని అంటున్నారు భారత ప్రజలు.

Related posts