telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పశ్చిమ బెంగాల్ లో జొమాటో ఉద్యోగుల ఆందోళన!

zomato deleted 5000 restaurants 

ప్రముఖ ఫుడ్ డెలివ సంస్థ రీజొమాటో ఉద్యోగులు ఈరోజు పశ్చిమబెంగాల్ లో నిఆందోళన చేపట్టారు. జొమాటో సంస్థ తమ మత విశ్వాసాలను కాదని ఆవు, ఎద్దు, గేదె మాంసం(బీఎఫ్), పంది మాసం(పోర్క్) లను తమ చేత కస్టమర్లకు పంపిస్తోందని మండిపడ్డారు. కంపెనీ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గత వారం రోజులుగా హౌరా బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్నా జొమాటో యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శించారు.

ఈ విషయమై పశ్చిమబెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ స్పందించారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పే అధికారం ఏ సంస్థకూ లేదన్నారు. జొమాటో ఉద్యోగుల ఆందోళన విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ ముస్లిం డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకోవడానికి ఓ ఆకతాయి నిరాకరించాడు. ముస్లిం డెలివరీ బాయ్ నుంచి తాను ఆహారం తీసుకోననీ, తనుకు హిందువును పంపాలని కోరాడు. దీంతో ఆహారానికి మతానికి సంబంధం లేదనీ, ఆహారమే ఓ మతమని జొమాటో స్పష్టం చేసింది.

Related posts