telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత నా ప్రతి సినిమా విడుదలకు ముందే చూస్తుంది : నాగ చైతన్య

Samantha

పెళ్లి తరువాత వరుస హిట్లతో దూసుకుపోతున్నారు సమంత, నాగచైతన్య. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన “మజిలీ” చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సమంత “ఓ బేబీ” చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య “వెంకీ మామ”, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అయితే వివాహం తర్వాత నాగచైతన్య సినిమాల విషయంలో ఆయన భార్య, అగ్ర కథానాయిక సమంత చాలా శ్రద్ధ పెడుతోందని ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌కు ముందు కథ వింటుందని, షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా చూసి పలు సూచనలు ఇస్తుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయం గురించి నాగచైతన్య మాట్లాడాడు. “వెంకీ మామ సినిమాను సమంత చూసింది. సినిమా బాగుందని చెప్పింది. నా ప్రతి సినిమాను విడుదలకు ముందు సమంత చూస్తుంది. సినిమా విషయంలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంది. కొన్ని సూచనలు ఇస్తుంది. నేను కూడా తన సినిమాల విషయంలో నా అభిప్రాయాన్ని చెబుతాను” అని చైతన్య తెలిపాడు. ఇక స‌మంత‌ ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు “ది ఫ్యామిలీ మ్యాన్” సీజ‌న్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగా, దానిని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌.

Related posts