telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చావు కబురు చల్లగా” టీజర్

CKC

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కార్తికేయ ఊర మాస్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

ఇక ఆర్ఎక్స్ 100′ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగాను నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Related posts