ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్లు తమ క్రేజ్ ను బట్టి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన వారు కోట్లలో డిమాండ్ చేస్తున్నారంటే టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటే….ఇస్మార్ట్ పోరి నభా నటేష్ భారీగా డిమాండ్ చేస్తోందట. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ రెమ్యూనరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటించే అవకాశం రావడం, దానికి ఆమె భారీగా డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అందాల ఆరోబోతకు, అబ్బురపరిచే అభినయానికి ఏ మాత్రం వెనుకడుగేయని ఈ ముద్దుగుమ్మతో ఈ సినిమాలో సూపర్ హాట్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అన్నింటికీ ఓకే కానీ ఈ సినిమాలో నటించాలంటే తనకు కోటి రూపాయల రెమ్యూననరేషన్ కావాలని డిమాండ్ చేసిందట. నభా నటేష్ మాటకు ఆ చిత్ర నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.
previous post

