telugu navyamedia
సినిమా వార్తలు

బాక్సాఫీస్‌ వద్ద ‘బంగార్రాజు’ భారీ వసూళ్లు..

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య లు హీరోలుగా నటించిన సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి విజయవంతం గా ప్రదర్శింప బడుతోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది బంగార్రాజు.

Bangarraju full movie collections | 'Bangarraju' box office collection Day 3: Akkineni Nagarjuna, Naga Chaitanya's film earns Rs 53 crore worldwide

సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు, రెండో రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. మూడ‌వ‌ రోజు కూడా అదే దూకుడు చూస్తుంది. కోవిడ్‌ నిబంధనలు అదిగమించి.. మూడో రోజుల్లో భారీ వ‌సూళ్ళుతో దూసుకుపోతుంది..

ఈ చిత్రం తొలిరోజు రూ.17 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. శనివారం ఈ సినిమా రూ.19.75 కోట్లు రాబట్టింది. ఆదివారం ఒక్కరోజే ఈ చిత్రం రూ.17.41 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 53 కోట్ల రూపాయలను వసూలు  చేసి మరోసారి బాక్సాఫీస్‌పై అక్కినేని ఫ్యామిలీ సత్తా చూపించారు.

సంక్రాంతి పండుగ కావడం, మరే పెద్ద సినిమా లేక పోవడం బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కొస్తున్నాడు. మంచి వసూళ్లను రాబడుతూ విజ‌య‌వంతంగా దూసుకు పోతున్నాడు.

Bangarraju' movie review: A passable festive entertainer that relies heavily on Nagarjuna and Naga Chaitanya - The Hindu

ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. రమ్య కృష్ణ, కృతి శెట్టి లు హీరోయిన్లుగా నటించగా, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Related posts