telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమను వదలని కరోనా.. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఈరోజు వచ్చిన కరోనా బులిటెన్ తో కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు.. తిరిగి కోలుకున్నారు. అయితే, తాజాగా  ప్రముఖ సంగీత దర్శకు బప్పీలహరి సైతం కొవిడ్ 19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బప్పీలహరికి కరోనా సోకిందని, దాంతో ఆయన్ని ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేర్చామని చెప్పారు. ఇటీవల బప్పీలహరిని కలిసిన వారు కూడా ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సింది వారు కోరారు. దేశవిదేశాల్లో ఉన్న బప్పీలహరి అభిమానులు, స్నేహితుల ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. 

Related posts