telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబుపై ట్రోలింగ్… ఎందుకంటే…?

even I donot get ticket in AMB said mahesh

సామాజిక మాధ్యమాల ద్వారా సెలెబ్రిటీలు తమ అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే సెలెబ్రిటీలు పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సెలెబ్రిటీల పోస్ట్ లో ఏమాత్రం పొరపాటు దొర్లినా ట్రోలింగ్ స్టార్ట్ చేయడానికి కాచుకుని కూర్చుంటారు నెటిజన్లు. ఈసారి సూపర్ స్టార్ మహేష్ వంతు వచ్చింది. ఇటీవల కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా వుంటున్న మహేష్ కొత్త సినిమాలపైనా.. కాన్సెప్ట్ బేస్డ్ చిన్ని సినిమాలపైనా వరుస ట్వీట్ లుతో టీమ్ ని అభినందిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ సహా స్పోర్ట్స్ పైనా మహేష్ ఆసక్తిగా ట్వీట్లు పెడుతున్నారు. వరల్డ్ కప్-2019 మ్యాచ్ ని కుటుంబ సమేతంగా వీక్షించిన మహేష్ .. క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరడంతో దీనిపై కూడా పోస్టింగులు పెట్టారు. వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన రసవత్తర పోరులో న్యూజిలాండ్ పోరాడినా ఇంగ్లాండ్ విజయాన్ని సాధించి కప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ పై మహేష్ “ఇంగ్లాండ్ కప్ గెలుచుకున్నా కానీ న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది” అని పోస్ట్ పెట్టారు. అదీ మ్యాచ్ అయిపోయాక కాస్త ఆలస్యంగా స్పందించారు. ఇక్కడే మహేష్ నెటిజన్ లకు దొరికిపోయారు. ఆదివారం మ్యాచ్ జరిగితే సోమవారం ఆర్థ్రరాత్రి స్పందించడం ఏమిటని మహేష్ ని ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మహేష్ చెప్పింది కరెక్టే అయినా టైమింగ్ రాంగ్. దీంతో అడ్డంగా బుక్కైపోయారు. ఇలా మహేష్ పై ట్రోలింగ్ జరగడం ఇది రెండవసారి. “మహర్షి” విషయంలో కూడా మహేష్ ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు.

Related posts