జబర్దస్త్ కమెడియన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ తల్లి ఇటీవల అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవరసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ల లక్ష్మిరాజం{ముక్కు అవినాష్ తల్లి} అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివాంర నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మిరాజం కుమారుడు అవినాష్‌కు అందజేశారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎంపీ సీట్లు గెలవాలి: కేటీఆర్