టీడీపీ తరఫున ఎన్నికైన ముగ్గురం ఎంపీలం కలిసి పని చేస్తామని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని జయదేవ్ స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని బీజేపీకిలోకి వెళుతున్నారని జరుగుతున్న ప్రచారం నిజంకాదని అన్నారు.
లోక్‌సభలో తాను, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని ఉన్నామని ఏ విషయమైనా ముగ్గురం కలిసి మాట్లాడుకుని పనిచేస్తామని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామన్నారు. తామంతా టీడీపీలోనే కొనసాగుతామని జయదేవ్ స్పష్టం చేశారు. తాము బాగా పనిచేశామని, అందుకే ప్రజలు తమను మళ్లీ గెలిపించారని తెలిపారు.