సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ కాకుండా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఈ స్టార్ పేసర్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేశాడు. ఇక కుటుంబంతో గడిపేందుకు డేవిడ్ వార్నర్ కూడా ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలనుకున్నట్లు కమిన్స్ ఇప్పటికే ప్రకటించాడు. ‘డేవిడ్ వార్నర్‌తో పాటు ప్యాట్ కమిన్స్.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉండాలనుకున్నారు. మిగిలిన వారు యథావిధిగా మ్యాచ్‌ల్లో పాల్గొంటారు. ఐపీఎల్ 2021 మిగతా లీగ్‌లో పాల్గొనని విషయాన్ని కమిన్స్ ఇప్పటికే వెల్లడించాడు. రూ.15 కోట్ల భారీ కాంట్రాక్టు ఉన్నప్పటికీ ఈ స్టార్ పేసర్.. క్యాచ్ రిచ్ లీగ్ ఆడేందుకు సుముఖంగా లేడు. అందుకు ప్రత్యేక కారణమేమీ లేదు.’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికా కథనం ప్రచురించింది. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ కూడా ఐపీఎల్ కోసం తమ జట్టు ఆటగాళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేయబోమని తెలిపారు.
previous post
next post
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్