పార్లమెంట్ సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటులోని అనెక్స్ భవన్ లో ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు R.C తివారి,రంగారాజన్ భేటి అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ బాలశౌరికి సమావేశం వివరాలను అధికారులు తెలిపారు. బాధ్యతలు స్వీకరించడంపై ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తం చేశారు. కాగా..పార్లమెంట్ సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజును తప్పించడంపై ఏపీ రాజకీయాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే..పార్లమెంట్ సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవీ నుంచి తప్పించడంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా తీవ్రంగా స్పందించారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని, తన పదవీ కాలం అయిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఓ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. వైసీపీ సోషల్ మీడియా దీనిపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహించారు.
previous post