అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పెళ్లి నేపథ్య కథతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దీనిని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ కామెడీ అక్టోబరు 15న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. శుక్రవారం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 19న రిలీజ్ కానుందీ .తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఓటీటీ విడుదలైంది.

పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి (హర్ష)గా అఖిల్, స్టాండప్ కమెడియన్ (విభావరి)గా పూజా హెగ్డే కనిపించి ఆకట్టుకున్నారు. తొలిసారిగా అక్కినేని అఖిల్.. ఈ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. ఈ చిత్రంలోని లెహరాయిగుచ్చే గులాబి, చిట్టి అడుగు పాటలు అయితే.. శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.

ఈ ట్రైలర్ లో ఇద్దరూ సంతోషంగా ఉంటారని పెళ్ళి చేసుకుంటే..సర్దుకుపో.. సర్దుకుపో అంటుంటే..ఎలాగో బ్రతికి చావు అన్నట్టు ఉంది నాకు.. కపుల్స్‌కి నా కథ డేంజర్ విడిపోనా ..విడిపోతారు అనే అఖిల్ చెప్పే డైలాగ్ సూపర్‌గా ఆకట్టుకుంటుంది.


హీరో సిద్ధార్థ్ పై నయనతార బాయ్ ఫ్రెండ్ అసహనం