నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తాగునీటి సమస్యలపై ప్రతి ఒక్క ఎంపీ దృష్టి పెట్టాలని సూచించారు.
నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపీలకు సూచించారు. ప్రజలు తాగు నీటి కొసం ఇబ్బందులకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీలకు చెప్పారు.


ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం: ఉత్తమ్