telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పది పరీక్షలపై ఏపీ సర్కార్ క్లారిటీ

exam hall

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని టీఎస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవచ్చని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టమైన ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని మంత్రి పేర్కొన్నారు.

Related posts