telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రెసిలియా చేరుకున్న .. భారత ప్రధాని మోడీ..

modi reached bresilia for bricks meet

ప్రధాని మోడీ బ్రిక్స్‌ దేశాల 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బ్రెసిలియా చేరుకున్నారు. ఈ సమావేశం ‘ఎకానమిక్‌ గ్రోత్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ ప్యూచర్‌’ అనే నినాదంతో జరుగనున్నది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చర్యలను బలోపేతం చేయడం, ఆ దిశగా సభ్య దేశాల మధ్య సహకారం అందించుకోవడం, డిజిటల్‌ ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇతర కీలక రంగాల్లో సంబంధాలను పటిష్టం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఈ పర్యటనపై మోడీ స్పందిస్తూ.. బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సమావేశం సభ్య దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్ధిక సంబంధాలు ఖచ్చితంగా బలోపేతమవుతాయని అనుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. ఈ ద్వైపాక్షిక సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తో సహా సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

Related posts