telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ సర్కార్‌ తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతుంది: రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మోదీకి మొదటి నుంచి తెలంగాణపై వివక్షత భావం ఉందని తెలిపారు.

రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఎండగట్టారని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్‌లో తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ఎంపీ ప్రియాంక గాంధీకి సీఎం ఎక్స్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్త చేశారు.

రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారని విమర్శించారు.

మన రైతుల కోసం.. మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పత్తా లేరని ఎద్దేవా చేశారు.

గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు.

Related posts