కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేయాలని, కౌన్సిల్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం శాసనమండలిలో రెండు పక్షాల వాదనలు విన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డి పై అనర్హత వేటు వేయాలని టీఆరెస్ శాసన మండలి పక్షం కోరింది. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల తరపున పలువురు న్యాయవాదులు వాదించారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.