లాక్ డౌన్ సమయంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు.పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
జనం రోజా పై పువ్వులు చల్లుతుండగా ఆమె పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులతో కలిసి ముందుకు కదిలారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శలు గుప్పిస్తున్నారు.