telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు.. కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకు?

Professor Nageshwar Ex mlc

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష 60వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణా ప్రభుత్వం కోటి మందికి సేవ చేసే ఆర్టీసీ కి 700 కోట్లు ఇవ్వలేదా..? అని ప్రశించారు. ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకని నిలదీశారు.

కార్మికుల జీతాలు పెరిగినందువల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన పచ్చి అబద్ధమని చెప్పుకొచ్చారు. ఈ రోజుతో ఆర్టీసీ సమ్మె 12వ రోజుకు చేరినా.. కోర్టు చర్చలు జరపమని చెప్పినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమేంటి..? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్ సగటు వేగం 15కి.మీ. ఇందుకు కారణం ట్రాఫిక్, రోడ్లు బాగాలేకపోవడమే అని ఆయన చెప్పుకొచ్చారు.

Related posts