telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పార్టీలో చిందేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే..వీడియో వైరల్

ఏపీలో చిత్తూరు జిల్లా పూతలుపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డ్యాన్స్‌తో అదరగొట్టారు.నక్కిలీస్ గొలుసు పాటకు ఎమ్మెల్యే మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పైమాఘం సుగుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో.. వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. చెన్నైలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలసి చిందులు వేశారు.

‘పలాస మూవీలోని‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట వేయగా.. అదిరిపోయే మాస్ స్టెప్పులతో అలరించారు ఎమ్మెల్యే బాబు. పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ దుమ్మురేపారు. కాగా, ఎమ్మెల్యే డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Related posts