telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సిగాచి పరిశ్రమలో శిథిలాల కింద గల్లంతైన యువతి: సహాయక చర్యలు ముమ్మరం

పాశమైలారంలో సిగాచి పరిశ్రమవద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు.

అయితే సిగాచి పరిశ్రమలో ఇంకా పది మంది ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా.. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన టైంలో ఇంటర్వ్యూ‌కు వచ్చిన ఓ యువతి గల్లంతైంది.

సోమవారం (జూన్ 30) ఉదయాన్నే ఓ యువతి సిగాచి కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమె హెచ్ఆర్ ఛాంబర్‌కు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని ఇతర కార్మికులు చెబుతున్నారు.

అయితే ఇప్పటి వరకు ఆ యువతి జాడ తెలియని పరిస్థితి. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కూడా స్పష్టత లేదు. శిథిలాలను తొలగిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్యపై కూడా సరైన క్లారిటీ లేదు. మొదట 40 అని చెప్పి తరువాత 38 మంది చెందినట్లు ప్రకటించారు.

మరో 35 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇక సిగాచి పరిశ్రమ వద్ద గల్లంతైన వారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటికి తమ వారి ఆచూకీ చెప్పడం లేదంటూ ఆందోళనకు దిగారు.

అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts