telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కనిపించని కాలమా…. నీకు వందనం

కనిపించని కాలమా
నీకు వందనం
కారణాలు ఏవైనా
కలతచెందినది మనసు
కరుణకై వెతకకు
కష్టాలకు బెదరకు
కరుడుకట్టినదీ లోకం
కదిలించకు నీవు
కలలోనైనా గెలుపునే కాంక్షించు
కాదు నీకు ఏది అసాధ్యం
అనితర సాధ్యాన్ని సాదించు
గెలిచి నిరూపించు
కష్టాన్ని ఎదిరించు
కాలాన్ని జయించు
ఉన్నతికై పయనించు
ఉధ్వేగాన్ని భరించు
ప్రతికూలతను స్వీకరించు
జీవన పయనాన్ని కొనసాగించు
మరణం తప్పదని గ్రహించు
దైవాన్ని తపించు
………………………
నా కవిత నా అంతరంగం
నా ఊహ నా మనసు
నా భావనే ఆలోచన
నా కలతే నా స్పందన
నా అనుభూతే తీయటి కవిత
నా అన్వేషణే అక్షర మాల
అణుక్షణం తపించే నా తపనే
ఓ కావ్యం నా జీవితమే
ఒక రచన నా నిబధ్దతే
నిలువుటధ్దం కోరికలను
జయించటమే నా ఆధ్యాత్మికత
భగవంతున్ని తెలుసుకోవటమే
నా లక్ష్యం..

Related posts