ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో సారి విమర్శలు గుప్పించారు. ఏపీ పై చంద్రబాబుకు ప్రేమ వుంటే తెలంగాణలో ఆస్తులన్ని అమ్ముకొని శాశ్వతంగా ఆంధ్రాకు వెళ్లిపోవాలని సూచించారు. అంతేకానీ కేవలం హైదరాబాద్ నివసిస్తున్నఏపికి చెందిన సామాన్య ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబు తమపై బురదజల్లే ప్రయత్నం చేశాడని తలసాని అన్నారు.
కేవలం తనకు మాత్రమే ఆంధ్ర ప్రజలపై ప్రేమున్నట్లు మాట్లాడాడని దుయ్యబట్టారు. తెలంగాణ లో ఏపీ నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ముఖ్యంగా హైదారాబాద్ లో ఆస్తులున్నవారిని బెదిరించామని, కొట్టామని ఆయన ఆరోపించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు నిజాయితీ గల నాయకుడైతే ముందు హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్ముకొవాలని తలసాని సూచించారు. ఐదు ఓట్ల కోసం నీచంగా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.

