telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

హౌస్ అరెస్ట్ నుండి ఫస్ట్ లుక్ వచ్చేసింది…

తెలుగు చిత్ర సీమలో మంచి కమెడియన్స్‌గా పేరుతెచ్చుకున్న నటులు సప్తగిరి, శ్రీనివాస రెడ్డి. వీరు ఇటీవల ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలను విడుదల చేశారు. సప్తగిరి తాను హీరోగా రెండు మూడు సినిమాలను తెరకెక్కించాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాలు అనుకున్నంత ఆకట్టుకోలేకపోయాయి. అదే తరహాలో శ్రీనివాస రెడ్డి హీరోగా జయంబునిశ్చయంబురా సినిమా విడుదలైంది. అందులో శ్రీనివాస్ హీరోగా అంతగా మెప్పించలేక పోయాడు. అయితే ప్రస్తుతం వీరు ప్రధాన పాత్రల్లో మరో సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు 90ఎంఎల్ ఫేమ్ దర్శకుడు షేఖర్ రెడ్డి డైరెక్షన్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు హౌస్ అరెస్ట్ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈరోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఇక ఇందులో అదుర్స్ రఘు, రవి ప్రకాష్, సునన్యాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. . ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిచనున్నాడు. చంద్రబోస్ పాటలు రాయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతోంది. చూడాలి మరి ఈ సినిమా వీరికి హిట్ ను అందిస్తుందా… లేదా అనేది.

Related posts