telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జువనైల్ హోం నుంచి బాలలు తప్పించుకునే ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ – నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు

సైదాబాద్ జువనైల్ హోం నుంచి ఐదుగురు బాల‌లు త‌ప్పించుకుపోయిన ఘ‌ట‌న ప‌ట్ల మంత్రి సీత‌క్క సీరియ‌స్ అయ్యారు.

ఈ ఘటనలో విధుల ప‌ట్ల నిర్ల‌క్షం వ‌హించిన సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీత‌క్క ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ఇద్ద‌రు సుప‌ర్వైజ‌ర్లపై వేటు పడింది. సుప‌రిండెంట్ కు మెమో జారీ చేశారు.

జువనైల్ హోం బాల‌లు త‌ప్పించుకుపోకుండా అద‌న‌పు సిబ్బందిని నియ‌మించాల‌ని మంత్రి సీత‌క్క ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు.

ఇలా ఉండగా, మంగ‌ళ‌వారం రాత్రి జువనైల్ హోం నుంచి ఐదుగురు బాల‌లు త‌ప్పించుకుపోయారు. ఈ ఘ‌ట‌న పై స‌చివాలయంలో మంత్రికి జువనైల్ వెల్ఫెర్ శాఖ‌ అధికారులు నివేదిక స‌మ‌ర్పించారు.

జువనైల్ వెల్ఫెర్ శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రోబేష‌న్ సుప‌ర్వైజ‌ర్ న‌వీన్ ఘ‌ట‌న వివ‌రాల‌ను మంత్రికి వివ‌రించారు.

త‌ప్పించుకుపోయిన ఐదుగురు బాల‌ల్లో ముగ్గురు ఆచూకి ల‌భించింద‌ని.. మిగిలిన ఇద్ద‌రు బాల‌ల‌ ఆచూకి క‌నుక్కునేందుకు పోలీసుల స‌హ‌యం తీసుకుంటున్నామ‌ని మంత్రికి అధికారులు వెల్ల‌డించారు.

Related posts