చంద్రబాబు, లోకేష్ లకు ప్రతిదీ రాజీకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రీకొడుకులు చివరకు సినిమాలను కూడా రాజకీయం చేస్తున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా టికెట్ల వివాదంపై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ సినిమాను తాము ఎందుకు తొక్కేస్తామని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ధరలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటప్పుడు భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సిందన్నారు. టిక్కెట్ల రేట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత రిలీజ్ చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ ను తాము తొక్కడం లేదని, ఎన్టీఆర్, హరికృష్ణలను తొక్కింది తెలుగుదేశం పార్టీయే నని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ లకు ప్రతిదీ రాజీకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రీకొడుకులు చివరకు సినిమాలను కూడా రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
కుప్పం సభలో వన్ సైడ్ లవ్ ఉండదని చంద్రబాబు చెప్పారని, మరీ ఇది ఏ సైడ్ లవ్వో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హై కోర్టు ఆదేశించిందని అన్నారు. ఎక్కడైనా జాయింట్ కలెక్టర్ కి లెటర్ పెట్టారా.. హై కోర్టు తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదు.
మైక్ పట్టుకుంటే నీతులు చెప్పే హీరోగారు.. నీతిమాలిన పనులకు పాల్పడటం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించే రాజకీయ పార్టీలుండటం దురదృష్టకరమన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాయన్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎంతటి కిరాతకంగా వ్వవహరించడానికేనా సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.


రికార్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి… ప్రభాస్ మాత్రం అందుకు అర్హుడు : అల్లు అర్జున్