అన్నిరంగాల్లో అభివృద్దిపథంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ని ఎలాగైనా దెబ్బకొట్టానే లక్ష్యంతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తిరువురు జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీని విపక్ష నేత జగన్ పల్లెత్తుమాట కూడా అనరని అన్నారు. వారి మధ్య లాలూచీ ఏంటో అని లోకేష్ ప్రశ్నించారు.
జగన్ అసెంబ్లీకి రాకుండా జీతాలు, అవెన్సులు మాత్రం తీసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకొచ్చేటప్పుడు అవినీతిపరుల భరతం పడతానని ప్రగల్భా లు పలికారని, ఇప్పుడు అవినీతిపరులను చంకనెక్కించుకుని దాడులు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మోడీ అవినీతిపరుల్ని అరెస్ట్ చేయాంటే, దొంగబ్బాయి ఆయన పక్కనే ఉన్నాడని ఎద్దేవా చేశారు.

