పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు జోష్‌లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.. ఈ సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత గన్‌తో హల్‌చల్ చేశాడు. నిన్న ఎమ్మెల్సీ సంబరాల్లో గన్ తెచ్చిన గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్… గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్నవారు ఆపడంతో కట్టెల శ్రీనివాస్ గన్‌లోపల పెట్టుకున్నాడు. అయితే… దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌కు అసలు ఆ గన్ ఎక్కడిది… ఎవరూ ఇచ్చారు అనేది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. అయితే… లైసెన్స్‌డ్ అని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. కాగా.. ఇదే సంబరాల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పటాకులు కాలుస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
previous post
మోదీ చెబుతోన్న అసత్యాల వల్లే ఈ పరిస్థితి: రాహుల్