అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్‌ను ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ప్రారంభించిన కేటీఆర్.. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.. అనంతరం.. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు.. కాన్వాయ్ వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.. దాదాపు 15 నిమిషాల పాటు ఏబీవీపీ కార్యకర్తల నిరసన కొనసాగింది. పోలీసులు ఏబీవీపీ నేతలను లాక్కెళ్తున్న నేపథ్యంలో వారు రోడ్డుపై పడుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. 20 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
previous post
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!