telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్‌ ప్లాన్‌: దేవినేని

Minister Devineni uma fire ys jagan

తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ తరహా కుట్రల్ని జగన్‌ కోసం ఏపీలో ప్రయోగించేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేశారని ఆయన ఆరోపించారు.

వైసీపీ ఎంపీ అభ్యర్థుల్ని కేసీఆర్‌, మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని అభ్యర్థులకు వైసీపీ బీఫారాలను అందజేస్తున్నారని మంత్రి అన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ గెలుస్తారని ఆనాడు కేసీఆర్‌ చిలుక జోస్యం చెప్పారని, అయినప్పటికే ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోందని దేవినేని జోస్యం చెప్పారు. ఏపీ పోలీసులు హైదరాబాద్‌ వెళ్తే కేసులు పెడుతున్నారని, ఎవరి కుట్రలకు భయపడేది లేదన్నారు.

Related posts