telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని ఫైర్‌ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్‌. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని పథకాలకు కేంద్ర నిధులు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్‌ రూ. 200 కంటే ఎక్కువ ఇవ్వట్లేదని పేర్కొన్నారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో లేవని తెలిపారు. ఒక్కో డబుల్‌ బెడ్‌ రూం ఇంటికి కేంద్రం ఇస్తుంది కేవలం రూ. 72 వేలే అని వెల్లడించారు మంత్రి వేముల. అంతకంటే ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. నిరూపించకుంటే బండి సంజయ్‌ రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు మంత్రి వేముల ప్రశాంత్‌. దేశంలో ఏ రాష్ట్రమూ.. ఇవ్వలేని, అమలు చేయలేని పథకాలు ఒక తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందని పేర్కొన్నారు. రూ. 2016 పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.

Related posts