telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాస్క్‌లు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 24 అనుమానిత కేసులు నమోదు కాగా.. వారిలో 20 మందికి కోవిడ్‌ సోకలేదని తేలింది. మిగిలిన నలుగురినీ అనుమానితులుగానే భావిస్తున్నారు.

ఈ వైరస్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాస్క్‌లను బ్లాక్‌ మార్కెట్లో రకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగినన్ని మందులు, మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే ఒంగోలులో రెండు షాపులపై కేసుల నమోదు చేశారు.

Related posts