తన భార్య గురించి అధికార వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆవేదన చెందారు. దీనిపై ఆంద్రప్రదేశ్ రాజకీయనాయకులు, కుటుంబసభ్యులుతో పాటు సినీ ప్రముకులు స్పందిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీలో చెడు సంప్రదాయం మొదలైందని, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సరికావన్నారు. శాసనసభ హుందాతన కోల్పోయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే కానీ తిట్లు ఉండకూడదని నాగబాబు సూచించారు.
టీడీపీని గానీ, వైఎస్ ఆర్ పార్టీని ప్రత్యర్థి పార్టీగానే చూస్తాము కానీ శత్రువు లా చూడమని మెగా బ్రదర్ నాగాబాబు అన్నారు. తాను చంద్రబాబు నాయుడుని, జగన్‌పై విమర్శను చేశాను కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ అనలేదని అన్నారు.
చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం నిజానికి చాలా బాధ కలిగించిందని అన్నారు. . చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు కన్నీళ్లు పెట్టుకోవడం వ్యక్తిగత నాకు నచ్చలేదని అన్నారు. ఎవరైనా, ఏ పార్టీ అయినా విమర్శంచుకోవడం మంచిదే కానీ.. దిగజారి ప్రవర్తించడం సరికాదన్నారు.
టీడీపీ, వైసీపీ శ్రేణులు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని, ముఖ్యంగా కుటుంబసభ్యులను దీనిలోకి లాగొద్దంటూ హితవు పలికారు. ఈ దరిద్రపు చెత్త సంప్రదాయం ఎందుకొచ్చిందో మన కర్మ అని అన్నారు. అందరూ పార్టీల పాలసీల ప్రకారం విమర్శించుకోవాలని సూచించారు. జనసేనను కూడా విమర్శించవచ్చని పేర్కొన్నారు.
సీఎం జగన్ మీద టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా దూషించడం కూడా కరెక్ట్ కాదని నాగబాబు అభిప్రాయపడ్డారు. మళ్లీ నిన్న చంద్రబాబును చూసిన తర్వాత తన మనసు కలచివేసిందని నాగబాబు పేర్కొన్నారు. ఎవరైనా సరే కుసంస్కారమైన పనులు చేయొద్దంటూ మెగా బ్రదర్ హితవు పలికారు.
గతంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను, తన కుటుంబాన్ని ఇలాగే అనుచితంగా విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా… ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నానని నాగబాబు తెలిపారు.

