ఇటీవల విడుదల చేసిన పోస్టర్ ఫస్ట్ లుక్ తో మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ వివాదంలో చిక్కుకుంది. తమ మనోబావాలు దెబ్బతినే విధంగా పోస్టర్ ఉందని కొందరు ఫిర్యాదు చేయడంతో ఇది మొదలైంది. దాంతో సంస్థ వారు అధికారిక నోటీసును విడుదల చేశారు. తాము విడుదల చేసిన పోస్టర్ కొందరిని బాధించిందని, కానీ తాము ఎన్నడూ కూడా సమాజంలో ఎవ్వరినీ బాధపెట్టే విధంగా ఏమీ చేయాలనుకోలేదని, అనుకోకుండా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరుతున్నామని అన్నారు. దీనిని ఆపేందుకు పోస్టర్‌ను రద్దు చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ అవినాష్ రెడ్డి తెలుపుతూ నోటీసు విడుదల చేశారు. ఇదిలా ఉంటే మాటినీ ఎంటర్టైన్మెంట్ ఇటీవల నిర్మించనున్న సినిమా మిషన్ ఇంపాజిబుల్ వివాదానికి గురయింది. అయితే ఈ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో ఆంజనేయుడు, శివుడు, కృష్ణుని వేషాలలో ముగ్గురు పిల్లలు తుపాకులు పట్టుకొని ఉంటారు. సినిమా పేరులో కూడా మిషన్ ఇంపాజిబుల్లో ఎస్ఐఓ అనె అక్షరాల బదులుగా హెచ్ఏ ఉంటాయి. దాంతో హిందూ దేవుళ్లు చేతిలో తుపాకులు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని అన్నారు. అంతేకాకుండా సినిమా మేకర్స్‌పై కేసును నమోదు చేయాలంటూ సోషల్ మీడియాలో దుమారం లేపారు.
previous post
next post