telugu navyamedia
సినిమా వార్తలు

విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే..

మా ఎన్నిక‌లు ర‌చ్చ న‌డుస్తుండ‌గానే కొత్త అధ్య‌క్షుడు హీరో మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇక కొత్త క‌మిటీ ఎప్పుడు ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఒక‌వైపు ప్ర‌కాశ్‌రాజ్ స‌భ్యులంతా ముకూమ్మ‌డి రాజీనామా చేసిన నేప‌థ్యంలో క‌మిటీ ఎలా ఫామ్ అవుతుంది. వాళ్ల స్థానంలో మ‌రి కొంత‌మందిని విష్ణు నియ‌మిస్తారా లేదా అనేది తెలియాల్సిఉంది.

 ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ రాజీనామా చేయడమే కాదు… మంచు విష్ణుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నామని నిన్న ప్రేస్‌మీట్‌లో ప్రకటించారు. కాగా.. ఎన్నికల ప్ర‌చార‌ సందర్బంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు. కానీ మంచు విష్ణు మాత్రం భారీ హామీలు ఇచ్చారు.

MAA Elections 2021: Manchu Vishnu About His Contest - Sakshi

విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే..
* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం!
* తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం.
*‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు.
*‘జాబ్‌ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం!
* అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం.
*‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్‌ కమిటీ
* గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం.
* అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం.
* కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం
* ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు.
*‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ ఏర్పాటు చేస్తాం.
* అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్‌ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి.
*  తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రాఫర్ మంత్రులను కలిసి నటులుగా మాకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకుంటాం. వారి సపోర్ట్ మేం కోరుకుంటాం. వారు మాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను, నా ప్యానల్ పూర్తిగా గెలిస్తేనే ఇవన్నీ చేయగలను.

Related posts