యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా ఏకంగా 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్నాడు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపుతో ముందుకు వచ్చిన ప్రభాస్ జిన్నారం మండలం ఓఆర్ఆర్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత తీసుకున్నాడు. ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు ప్రభాస్ తోపాటు ఎంపీ సంతోష్ కుమార్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంఖుస్థాపన చేసి మొక్కలు నాటారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను పరిశీలించారు. ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నాడు. ఇప్పటికే ఈ 1650 ఎకరాల అటవీప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
previous post
next post